గద్వాల జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 78వ జయంతి

గద్వాల్ నడిగడ్డ, ఆగస్టు 20 (జనం సాక్షి);
గద్వాల జిల్లా కేంద్రంలో శనివారము భారతరత్న భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 78వ జయంతి గద్వాల పట్టణం లో ఘనంగా జరిగాయి.
మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 78వ* జయంతి సందర్భంగా గద్వాల పట్టణంలోని పాత బస్టాండ్ చౌక్ లో రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ 40 సంవత్సరాల వయసులోనే భారత ప్రధాన మంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారనీ, ఐటీ రంగాన్ని తీసుకొచ్చి దేశ పురోగతిని పెంపొందించారనీ, యువతకు ఆదర్శంగా నిలిచారనీ, తన చివరి ఊపిరి ఉన్నంతవరకు దేశం కోసం ప్రాణాలర్పించిన అవిశ్రాంత ధీరుడు నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు గాంధీ వారసత్వం పుచ్చుకొని దేశాన్ని ప్రగతి భాగంలో నడిచిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని గద్వాల నియోజకవర్గం కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకులు వీరుబాబు అన్నారు.
ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శంకర్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, మల్దకల్ మండల అధ్యక్షులు నల్లారెడ్డి, ఇషాక్ , ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వెంకటేష్,శివరాజ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.