గద్వాల పట్టణంలో ట్రాఫిక్ ఎస్సై ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అవగాహన సదస్సు…

– అవగాహన కల్పిస్తున్న సాయూదా దళ  డీఎస్పీ ఇమ్మానియేల్ ..
గద్వాల ప్రతినిధి నవంబర్ 11 (జనంసాక్షి) :- గద్వాల పట్టణంలో శుక్రవారం నాడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో  పట్టుబడిన 32 మందికి ట్రాఫిక్ సంస్థ నందు  అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ ఇమన్యూయల్ మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలను నడపడం ద్వారా ప్రమాదాలకు గురి కావడం జరుగుతుంది. అనంతరం గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ విజయభాస్కర్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలను నడిపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి లైసన్సును రద్దు చేస్తామని అన్నారు. ద్విచక్ర వాహన దారులు విధిగా హెల్మెట్ పెట్టుకొని వాహనాలను నడిపించాలని సూచించారు. ప్రయాణం సమయంలో డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడరాదని పేర్కొన్నారు. తెలంగాణలోనే గద్వాల జిల్లాలో  ఎక్కువ ప్రమాదాలు సెల్‌ఫోన్ మాట్లాడుతుండగానే జరుగుతున్నాయని వివరించారు.
ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణం చేస్తుంటారని, అలా చేయడం చట్టవిరుద్ధద్దమని అన్నారు. డ్రైవర్లు వాహనాల్లో కెపాసిటికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని సూచించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇంకెప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు

తాజావార్తలు