గమ్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ
ఫోటో ఉంది
హత్నూర జనం సాక్షి
మండలంలోని గోవింద్ రాజ్ పల్లి గ్రామానికి చెందిన ఎరుకల ఎల్లయ్య కుటుంబీకులకు మంగళవారం గమ్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.ఈనెల 7న విద్యుత్ ప్రమాదం సంభవించి ఎల్లయ్య నివసిస్తున్న పూరిళ్ళు పూర్తిగా దగ్ధమైంది.ఇంట్లో దాచిపెట్టిన నగదు,ఆహార సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి,ఈ నేపథ్యంలో గమ్యం ఫౌండేషన్ చైర్మన్ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా బాధితులకు పది రోజులకు సరిపడు నిత్యావసర సరుకులతో పాటు కొంత నగదును అందజేశారు.పూరిల్లు దగ్ధమై సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ ఎల్లయ్య కుటుంబీకులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సునీత రాజు,కృష్ణ గౌడ్,మహేష్ గౌడ్,స్వామి,సతీష్ గౌడ్,కార్తీక్ తదితరులు ఉన్నారు.