గరిష్ఠ స్థాయిలో ఉన్న సూర్యుడు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రెంటచింతలలో గరిష్ఠంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. హన్మకొండ , నిజామాబాద్ , రామగుండం, నంద్యాలలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. నందిగామ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ , నల్గొండ, ర్నూలులో 42 డిగ్రీలు.. నెల్లూరు, భద్రాచలం, హైదరాబాద్, మెదక్, అనంతపురం, తిరుపతిలో 41 డిగ్రీలు… ఒంగోలు , హకీంపేటలో 40 డిగ్రీలు.. కావలి, తుని, విజయవాడ, అరోగ్యవరంలో 39 డిగ్రీలు.. కాకినాడ, విశాఖపట్నంలో 38 డిగ్రీలు…నర్సాపూర్, మచిలీపట్నంలో 36 డిగ్రీలు … బాపట్ల , కళింగపట్నంలో 35 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.