గర్భిణిల జీవితాల్లో వెలుగు కెసిఆర్‌ కిట్‌


తల్లీబిడ్డల సంక్షేమానికి చర్యలు
పేదింటి మహిళకు వరంగా పథకం
ఉమ్మడి జిల్లాలో పెరిగిన సాధారణ ప్రసవాలు
వరంగల్‌,జూన్‌1(జ‌నంసాక్షి): ఆరోగ్య తెలంగాణను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న కెసిఆర్‌ కిట్‌ పథకం సత్ఫలితాలు ఇస్తోంది. తల్లీ,బిడ్డలా సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కె.సి.ఆర్‌. కిట్‌ పధకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకానికి జిల్లలో మంచి ఆదరణ లభిస్తున్నది. వరంగల్‌ పట్టణ, గ్రావిూణ అనే తేడా లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్య ఎంతో పెరిగాయి. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు మాతా, శిశు సంరక్షణ భాద్యతలు ప్రభుత్వం తీసుకోవడం పేద, బలహీన వర్గాల మహిళలకు ఎంతో భారం తప్పినట్లుగా మారింది. బాలింతల పౌష్టికాహారం లోప నివారణకు,ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు, తల్లి,బిడ్డలకు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు ఈ పధకం దోహదం చేస్తున్నది. తల్లి బిడ్డలకు ఎలాంటి ప్రాణ హాని లేకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. స్త్రీలు దారిద్య రేఖకు దిగువ వున్న మహిళల పరిస్థితి దయనీయంగా ఉంటున్నది. పైగా ఈ సమయంలో ఉపాధి లేకపోవడంతో సంపాదనం లేక పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. ఇది ప్రసవ సమయంలో ప్రనహానికి దారితీస్తుంది. పైగా ఇళ్ళ వద్ద ప్రసవాల వల్ల మాతా, శిశు మరణాలు సంభవిస్తున్నాయి. గర్భిణిలకు మరో జన్మగా మారుతోంది. ఈ దయనీయ పరిస్థితిని నివారించేందుకు ఆసుపత్రులను సమూలంగా సంస్కరించి సకల వసతులు కల్పించింది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకరించి నిపుణులైన వైద్యులచే ప్రసవాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది . హన్మకొండ, వరంగల్‌ ప్రసూతి ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగు పరిచి, అవసరమైన ఆధునిక పరికరాలు ఏర్పాటు చేసారు. గర్భిణులను ఆస్పత్రులకు చేర్చేందుకు ప్రత్యేక వాహనాలను 102 ను ఏర్పాటు చేసారు. గర్భిణిగా ఉన్నప్పుడు ఆసుపత్రిలో పరీక్షలకు తీసుకు వచ్చేందుకు సైతం ఈ వాహనాలు వినియోగి స్తున్నారు. ఈ పథకం క్రింద జిల్లాలో నాలుగు వాహనాలు సమకూర్చారు. ఇందులో రెండు వాహనాలు వరంగల్‌ సికెఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసారు. మిగిలిన రెండు వాహనాలు హన్మకొండ ప్రసూతి ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసారు. 2017 జూన్‌ లో కెసిఆర్‌ కిట్‌ ప్రవేశపెట్టిన తర్వాత జిల్లలో 11 పి.హెచ్‌.సి ల్లో ప్రసవాల సంఖ్య భారీగా పెరిగి, బలహీన
వర్గాల మహిళలు ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రాధాన్యత నిస్తున్నారు. మాతా, శిశు మరణాల రేటు తగ్గు ముఖం పడుతున్నాయి. వ్యాధి నిరోధక టీకాలు, విడతల వారిగా ఇచ్చే నగదు సహాయం అనుసధనం చేయడం వల్ల సకాలం లో పిల్లలకు టీకాలు వేయించే వారి సంఖ్య పెరిగింది. స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి శిశువు 9 నెలాలూ వచ్చు వరకు ఈ పధకం క్రింద రూ.12 వవేలు/రూ.13 వేలు ఆర్ధిక సహాయం నగదు బదిలీ ద్వారా వారి బ్యాంకు ఖాతాలోకి నేరుగా అందజేస్తున్నారు. పధకం రెండు ప్రసవాలకు మాత్రమే పరిమితంగా ప్రకటించారు. కెసిఆర్‌ కిట్‌ లు అందుకున్న వారిలో 90 శాతం మహిళలకు పేద, మధ్య తరగతి వర్గాలకు చెదిన వారు కావడం గమనార్హం. ఈ పధకం మహిళల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించింది అనడం లో అతిశయోక్తి లేదు.