గల్ఫ్‌ బాధితుల సమస్యలు పరిష్కరించండి

4

– కేంద్రానికి కేటీఆర్‌ వినతి

– ఉత్తమ రాష్ట్ర అవార్డు అందుకున్న మంత్రి

ఢిల్లీ నవంబర్‌6(జనంసాక్షి):

గల్ఫ్‌ బాధితులను ఆదుకోవాల్సిందిగా కేంద్ర విదేశాంగశాఖాధికారులను కోరినట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కేంద్ర విదేశాంగ శాఖ ఉన్నతాధికారులను మంత్రి కేటీఆర్‌ నేడు కలిశారు. ఈ భేటీలో ఎంపీ వినోద్‌, రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్‌లు పాల్గొన్నారు. భేటీ అనంతరం మంత్రి విూడియాతో మాట్లాడుతూ.. గల్ఫ్‌ బాధితుల కష్టాలను కేంద్ర విదేశాంగశాఖ దృష్టికి తీసుకువెళ్లాం. గల్ఫ్‌లో తెలంగాణవాసులు ఇబ్బంది పడుతున్నరు. బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాం.

గల్ఫ్‌లో కరీంనగర్‌ జిల్లావాసులు వేల సంఖ్యలో కార్మికులుగా పని చేస్తున్నరు. పనుల నిమిత్తం వెళ్లిన మహిళలకు ఎదురైన ఇబ్బందులను మంత్రిత్వశాఖ అధికారులకు వివరించినం. గల్ఫ్‌లాంటి ప్రాంతాల్లో మహిళలను ఇళ్ల పనుల్లోకి తీసుకురాకుండా కేంద్ర నిషేధ చట్టాన్ని తీసుకురావాలని కోరాం. గల్ఫ్‌తో పాటు విదేశాల్లో పని చేస్తున్న భారతీయులందరి వివరాలను ఒకే డేటాగా రూపొందించాలని కోరాం. రాష్ట్రాలతో విదేశీ మంత్రిత్వశాఖ వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని సూచించినం. కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల పెద్దూరుకు చెందిన ఐదురుగు కార్మికులు ఎదుర్కొంటున్న శిక్షపై చొరవ చూపాలని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు విజ్ఞప్తి చేశాం. అందుకు సంబంధించి రెఫరెండంను అధికారులకు అందజేసినం. అవసరమైతే బాధిత కుటుంబాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు.

అభివృద్ధి, సంక్షేమం విషయంలో తెలంగాణ దేశంలోనే ముందున్నట్టు మరోసారి రుజువైంది. బెస్ట్‌ ఇంక్లూజివ్‌ డెవలప్‌ మెంట్‌ విభాగంలో తెలంగాణకు ప్రతిష్టాత్మక ఇండియా టుడే అవార్డు దక్కింది. ఢిల్లీలో జరిగిన స్టేట్‌ ఆఫ్‌ ది స్టేట్స్‌ కాంక్లేవ్‌ -2015 కార్యక్రమంలో కేంద్ర ¬ంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ చేతుల విూదుగా మంత్రి కేటీఆర్‌ ఈ అవార్డు అందుకున్నారు.సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని కేటీఆర్‌ చెప్పారు. అన్ని రాష్ట్రాలతో పోటీ పడి తెలంగాణను అగ్రగామిగా నిలుపుతామన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో ముందుచేలా కృషి చేస్తామని కేటీఆర్‌ చెప్పారు.