గవర్నర్లు పంపిన బిల్లులను 3 నెలల్లోగా ఆమోదించాల్సిందే

` రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు
` మంత్రిమండలి నిర్ణయాలను గవర్నర్‌ గౌరవించాలి
` తమిళనాడు గవర్నర్‌ రవి తొక్కిపెట్టిన 10 బిల్లులకు ధర్మాసంన గ్రీన్‌సిగ్నల్‌
న్యూఢల్లీి(జనంసాక్షి): రాష్ట గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి నిర్దిష్ట టైమ్‌లైన్‌ విధిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తమిళనాడుకు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆపి ఉంచడంపై నాలుగు రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఆ బిల్లులకు క్లియరెన్స్‌ ఇచ్చింది. ఏదైనా బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే గవర్నర్‌ తీసుకోవాల్సిన అత్యధిక గడువు నెలరోజులు మాత్రమేనని తీర్పు ఇచ్చింది. 415 పేజీలతో కూడిన పూర్తి తీర్పును శుక్రవారం రాత్రి 10.54 గంటలకు సుప్రీంకోర్టు వెస్‌సైట్‌లో ఉంచారు. కాగా, గవర్నర్లు పంపే బిల్లుపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌లో కూడిన ధర్మాసం తాజాగా తీర్పునిచ్చింది. ఏదైనా జాప్యం జరిగితే రాష్ట్రపతి భవన్‌ అందుకు కారణాలను రాష్టాల్రకు వివరించాలని, నిర్దేశిత గడువులోగా రాష్ట్రపతి నుంచి స్పందన లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు మాండమస్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. రాజ్యాంగంలోని 200వ అధికారణ ప్రకారం మంత్రిమండలి సలహా సూచనల మేరకు గవర్నర్లు తప్పనిసరిగా వ్యవహరించాల్సి ఉంటుందని, రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్‌ చేసే అధికారం గవర్నర్లకు లేదని మార్చి 8న ఇచ్చిన తీర్పులో సుప్రీం ధర్మాసనం తెలిపింది. నిర్దిష గడువులోగా గవర్నర్‌ చర్య తీసుకోకుంటే గవర్నర్‌ చర్య జ్యుడిషియల్‌ స్కూట్రినీని ఎదుర్కోవలిసి వస్తుందని హెచ్చరించింది. కాగా, గవర్నర్‌ తొక్కిపెట్టిన 10 బిల్లులకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది చట్టాలను నోటిఫై చేసింది. ఇందుకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. రాష్ట్రపతి, గవర్నర్‌ ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేయడం రాజ్యంగ చరిత్రలో ఇదే మొదటిసారి. శాసన సభ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ సమ్మతించకపోవడం, పునఃపరిశీలనకు కూడా పంపకపోవడంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, గవర్నర్‌ తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుపడుతూ ఆ 10 బిల్లులకు మార్చి 8న క్లియరెన్స్‌ ఇచ్చింది. ఈ క్రమంలో దేశ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్‌ అనుమతి లేకుండా 10 బిల్లులు ఆమోదం పొందాయి. తమిళనాడుకు చెందిన పెండిరగ్‌ బిల్లులు ఆమోదించినట్లుగా ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి, గవర్నర్‌ ఆమెదం లేకుండానే 10 చట్టాలను నోటిఫై చేసింది. ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాజ్యాంగ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులను గవర్నర్‌ తన దగ్గరే ఉంచుకున్నారని.. దీనికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని ఆరోపిస్తూ స్టాలిన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. వెనక్కి పంపిన బిల్లులను తిరిగి పంపితే.. రెండోసారి ఆమోదించి పంపినా ఆమోదం తెల్పలేదని పేర్కొంది. దీంతో సుప్రీం ధర్మాసనం.. ఆ బిల్లులు ఆమోదించినట్లుగా పేర్కొంది. ఈ సందర్భంగా గవర్నర్‌ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. బిల్లులు ఆమోదించకుండా ఎందుకు తొక్కిపెట్టారని నిలదీసింది. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమని తమిళనాడు సీఎం స్టాలిన్‌ అభివర్ణించిన సంగతి తెలిసిందే.