గవర్నర్‌ను కలువనున్న నితీష్‌కుమార్
బీహార్, ఫిబ్రవరి 9 :
బీహార్‌లో రాజకీయ సంక్షోభం మరింతగా ముదిరింది. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు మాంఝీని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లుగా సోమవారం పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఆవెంటనే పార్టీ నిర్ణయంపై మాంఝీ మద్దతుదారులు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు సీఎం కావాలనుకుంటున్న నితీష్‌కుమార్ గవర్నర్ త్రిపాటీని కలవనున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో మాంఝీని సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందిగా పార్టీ అధిష్టానం ఆదేశాన్ని ఆయన బేకాతరు చేశారు. తనకు మొత్తం ఎమ్మెల్యేల మద్దతుతో పాటు, బీజేపీ మద్దతు కూడా ఉందని చెబుతూ సీఎం పదవి రాజీనామాకు నిరాకరించారు. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం జేడీయూ ఎమ్మెల్యేలతో నితీష్ గవర్నర్‌ను కలిసి బలప్రదర్శన చేయనున్నారు. దాదాపు 130 మంది ఎమ్మెల్యే మద్దతు ఉందని గవర్నర్ తెలియజేస్తూ లేఖలు కూడా సమర్పించనున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ, కమ్యూనిష్టు పార్టీ సభ్యులు తనకు మద్దతుగా నిలిచారని నితీష్ చెబుతున్నారు. మొత్తం 240 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీహార్ అసెంబ్లీలో పది ఖాళీలు ఉండటంతో 230 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
మ్యాజిక్‌ఫిగర్ కన్నా పది మంది ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారని గవర్నర్ వద్ద నితీష్‌కుమార్ బలప్రదర్శన చేయబోతున్నారు. ఈలోపు కేంద్రంతో సీఎం మాంఝీ సంప్రదింపులు జరిపి బీహార్ అసెంబ్లీని రద్దు చేసే దిశగా ప్రయత్నాలు చేయడం, ఈ ఏడాది చివర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీహార్ రాజకీయ పరిణామాలు కీలక దశలో ఉన్నట్లు తెలుస్తోంది.