గవర్నర్‌ వ్యవస్థపై కెసిఆర్‌ స్పందించరా?: చాడ

సిద్దిపేట,మే22(జ‌నం సాక్షి ):  గవర్నర్‌లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా పని చేస్తున్నారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయం తాజాగా కర్నాటక వ్యవహారంతో మరోమారు బయటపడిందన్‌ఆనరు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ కర్ణాటక పరిణామాలపై కేసీఆర్‌ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. రైతుబంధు పథకం సరిగా అమలు కావట్లేదని ఆయన ఆరోపించారు. స్వామినాథన్‌ కవిూషన్‌ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రహదారులపై వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తామని, జూన్‌ 2ను అమర వీరుల ఆకాంక్షల దినంగా పాటిస్తామని చాడ వెంకటరెడ్డి తెలిపారు. దేశంలో అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ఎప్పటికప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని పెంచుతూ 
నరేంద్ర మోదీ ప్రభుత్వం సామాన్యులపై ఆర్థిక భారం మోపుతోందని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. కేంద్రం చమురు ధరల్ని భారీగా పెంచడాన్నిప్రజలు  నిరసిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. పెరుగుతున్న ఇంధన ధరలతో జనం గగ్గోలు పెడుతున్నారని, ఇటీవల కర్నాటక ఎన్నికలు ముగియగానే వరుసగా ధరలను పెంచుతూ ప్రస్తుతం ఒకేసారి లీటరు పెట్రోల్‌పై 33 పైసలు, డీజిల్‌పై 26 పైసలు పెంచడం దారుణమన్నారు. దేశంలో మునుపెన్నడు లేని గరిష్ఠ స్థాయికి చమురు ధరలు చేరుకున్నాయన్నారు. పెట్రోల్‌, డీజిల్‌లను జీఎస్టీలో చేర్చితే ధరలు తగ్గేవని ఆయన అభిప్రాయపడ్డారు. పెంచిన ధరలను తగ్గించి సామాన్యులను ఆదుకోవాలని.. లేనిపక్షంలో అన్ని పార్టీలను కలుపుకొని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.