గాంధీ భవన్‌లో క్విట్ ఇండియా ఉత్సవాలు
సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలి : బొత్స
హైదరాబాద్, ఆగస్టు 9 (జనంసాక్షి):
క్విట్ ఇండియా దినోత్సవ వేడుకలు గాంధీభవన్‌లో గురువారం ఘనంగా జరిగాయి. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేసి ఉత్సావాలను ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారా యణ మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంతోనే దేశానికి స్వాతంత్య్రం లభించిందన్నారు. బ్రిటీష్‌పాలకులు కబంద óహస్తాల నుంచి దేశాన్ని విడిపించిన మహనీ యుల ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్‌పటేల్ ఆశయాలను కాంగ్రెస్ కార్యకర్తలు స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన కోరారు. అహింసా మార్గంతో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన ఘనత గాంధీమహాత్ముడికే దక్కిందని బొత్స కొనియాడారు. గాంధీ వారసుడిగా దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని బోత్స అన్నారు. సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో బలంగా ఉందని అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన నేతల ఆదర్శాలను, ఆశయాలను కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తిగా తీసుకున్నందునే ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేయగలుగుతోందని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకో వాలని బొత్స పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరిం చుకుని బొత్స, డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు.