గిట్టుబాటు ధరలు కల్పిస్తే పెట్టుబడి ఎందుకు?

ములుగు,జూన్‌29(జనం సాక్షి ): రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా ఎకరాకు రూ. 4 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. కౌలు రైతులకు ఆ నాలుగువేలుసైతం ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. సన్న, చిన్నకారు, కౌలురైతులను పట్టించుకోకుండా వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టారన్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హావిూని నెరవేర్చకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగుల ఆందోళనలును అణచివేయడం, అక్రమంగా కేసులు పెట్టడం వల్ల నిజాలను దాచలేరని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేదలు, దళితులు, బడుగు బలహీనవర్గాలు సంతోషంగా లేవన్నారు. తెలంగాణ కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని, ఇది కేవలం కేసీఆర్‌ ప్రభుత్వంలోనే చూస్తున్నామన్నారు.

——————-