గిడ్డంగుల సంస్థ గోదాముల్లోకి వరద
గుంటూరు: భారీ వర్షాల కారణంగా తాడేపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో రూ. 25 లక్షల విలువైన ఎరువులు, బియ్యం, మొక్కజోన్న నీటి పాలయ్యాయి. అదివారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో నే గోదాములోకి నీరు ప్రవేశించినదని రైతులు అరోపించారు.