గిరిజనులతో మాట్లాడిన రజత్‌ కుమార్‌

తప్పకుండా ఓటేయాలని సూచన

నల్లగొండ,నవంబర్‌17(జ‌నంసాక్షి): తండాల్లో నిర్వహించిన ఓటరు అవగాహనా కార్యక్రమాల్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ పాల్గొని పలు సూచనలు చేశారు. నిర్భయంగా ఓటేయాలని

అన్నారు. జిల్లాలోని చింతపల్లి మండలం దేనతండా ,కొండమల్లేపల్లి మండలం కేశ్యాతండాలో అధికారులు ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌, ఎస్పీ రంగనాథ్‌ విచ్చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై ఈ సందర్భంగా ఓటర్లకు అవగాహన కల్పించారు. ఏర్పాట్లపై ఆరా తీసారు. ప్రజలు తప్పినిసరిగా ఓటేయాలని రజత్‌ కుమార్‌ సూచించారు. ఎవరు కూడా తమకెందుకు అన్న భావనలో ఉండరాదన్నారు.

డిసెంబర్‌ 7న ఎన్నికలు జరిగే గిరిజనతండాల్లో పోలింగ్‌ కేంద్రాలు ఎలా ఉన్నాయి, సౌకర్యాలు సరిగా ఉన్నాయా లేదా.. అని పరిశీలించారు. అక్కడి ఏర్పాట్లపై అధికారులతో సవిూక్షించారు. స్వయంగా అక్కడి గిరిజన ఓటర్లతో మాట్లాడారు. ఈవీఎం, వీవీప్యాట్లపై వారికి ఎలా అవగాహన ఉందో అడిగి తెలుసుకున్నారు.