గిరిజనుల ఆరాధ్య దైవం సీఎం కేసీఆర్.
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు.
తాండూరు అక్టోబర్ 1(జనంసాక్షి)రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశానుసారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పని గొప్ప ఉద్యమ నాయకుడని,సెప్టెంబర్ 17న జరిగిన ఆదివాసీ, గిరిజనుల ఆత్మీయ సభలో చేసిన ప్రకటనకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేసి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న మహానేత అన్నారు.
నేటి నుంచి రిజర్వేషన్ల పెంపు అమల్లోకి వస్తుందని.విద్య, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు ఈ రిజర్వేషన్లు అమలవుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో గిరిజనుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి,ఈ సందర్భంగా మరోసారి గిరిజన రిజర్వేషన్ ఆరు నుండి 10 శాతం పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.గిరిజన బిడ్డల కష్టాలు, సమస్యలు, జీవన స్థితిగతులపై పూర్తి అవగాహన ఉన్న మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ కి యావత్ గిరిజన జాతి జీవితాంతం రుణపడి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.