గిరిజన యోధుని మరణం, వర్ధంతి పై స్పష్టత కరువు వాస్తవ చరిత్ర అందించాలి

వనపర్తి అక్టోబర్ 21(జనం సాక్షి) జల్ జంగల్ జమీన్ కోసం నిజాంపై పోరులో అమరుడైన గోండు గిరిజన యోధుడు కొమరం భీమ్ మరణం వర్ధంతి పై లోతుగా పరిశోధించి వాస్తవాలు పాఠ్యపుస్తకాలలో నమోదు చేయాలని సిపిఐ ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు ఆయన జయంతి అక్టోబర్ 22న ఉన్న నేపథ్యంలో శుక్రవారం వనపర్తి తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు మరణం, వర్ధంతి తేదీలపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతూ తాసిల్దార్ రాజేంద్ర గౌడ్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి కళావతమ్మ ఏఐఎస్ఎఫ్ నాయకులు వంశీ మాట్లాడారు కొమరం భీమ్ మరణం తేదీలు వేర్వేరుగా ఉన్నాయన్నారు వాస్తవ తేదీ గుర్తించి చరిత్ర పాఠ్యపుస్తకాలలో ఇవ్వాలని డిమాండ్ చేశారు సెప్టెంబర్ ఒకటవ తేదీ ,అక్టోబర్ 8వ తేదీ, అక్టోబర్ 27వ తేదీ లలో మరణించినట్లు రికార్డులలో నమోదయి ఉందని తెలిపారు ఒక మనిషి మూడు వేరు వేరు తేదీలలో చనిపోవడం ఉండదని తెలిపారు మహనీయుల జయంతి లేదా వర్ధంతిని వారు పుట్టిన ,చనిపోయిన తేదీలలో మాత్రమే జరిపే ఆనవాయితీ ఉందని తెలిపారు . నిజమైన తేదీ గుర్తించి అదే రోజు వర్ధంతి జరపాలని కోరారు గోండు గిరిజన విముక్తి కోసం పోరాడి మరణించిన ఆయన జీవిత చరిత్ర పై ఇంత నిర్లక్ష్యం సరి కాదని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన 9వ తరగతి తెలుగు ఉపవాచకం పుస్తకం 142వ పేజీలో ఆయన 01.09.1940 న మరణించినట్లు పేర్కొన్నారని తెలిపారు. ఆ పాఠ్య పుస్తకం తేదీ ప్రకారం అయితే సెప్టెంబర్ 1వ తేదీన నే కొమరం భీమ్ వర్ధంతి జరపాల్సి ఉంటుందని తెలిపారు. కానీ 10వ తేదీన కొమరం భీం జిల్లా జోడేఘాట్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీ కొమరం భీమ్ వర్ధంతి నిర్వహించకుండా 10న చేయటం జీవిత చరిత్ర పైనే విద్యార్థులలో అప నమ్మకం నమ్మకం,అయోమయం ప్రభుత్వం కలిగిస్తున్నదని విమర్శించారు కాగా పరోపక్క అక్టోబర్ 8వ తేదీన కొమర బియ్యం వర్ధంతి ఉన్నట్లు క్యాలెండర్లలో ముద్రిస్తున్నారని దాని ప్రకారం కొందరు గిరిజన విద్యావంతులు ఇతరులు అదే రోజు కొమరం భీం వర్ధంతి జరుపుతున్నారని తెలిపారు ఇక ఇంటర్నెట్లో ఆయనఅక్టోబర్ 27న సైనిక కాల్పుల్లో చనిపోయినట్లు నమోదయి ఉందని తెలిపారు అందువల్ల కొమరం భీమ్ మరణం తేదీ వర్ధంతి పై ప్రభుత్వం చరిత్రకారులతో లోతైన అధ్యయనం చేయించాలని డిమాండ్ చేశారు తేల్చిన వాస్తవాల ఆధారంగా మరణ తేది వర్ధంతి పై పాఠ్యపుస్తకంలో మార్పులు నమోదు చేసి గందరగోళానికి తెరదించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సభ్యులు పి కళావతమ్మ జిల్లా నాయకులు రమణ ఏఐఎస్ఎఫ్ నాయకులు ఓం,అంజి,సమత గాయత్రి, కుర్మూర్తి,అశోక్ తదితరులు పాల్గొన్నారు