గిరిజన రిజర్వేషన్ పెంపు చారిత్రాత్మక నిర్ణయం:ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి
తిరుమలగిరి(సాగర్), సెప్టెంబరు 18 (జనంసాక్షి): గిరిజన రిజర్వేషన్ల పెంపు చారిత్రాత్మక నిర్ణయం అని ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి అన్నాడు ఆదివారం మండల కేంద్రంలో శ్రీనివాస పంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి పాల్గొని, ఎంపీపీ భగవాన్ నాయక్, జడ్పిటిసి సూర్య, వివిధ తండాల సర్పంచులు,గిరిజన నాయకులతో కలిసి ఎస్టీల రిజర్వేషన్ పెంపున పట్ల సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ హర్షంవ్యక్తం చేశారు.
గిరిజన రిజర్వేషన్ పెంపు పై సిఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని అన్నారు.తెలంగాణ ఏర్పాటు అయిన అనంతరం గిరిజనుల జనాభా మేరకు, రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చి,కేసీఆర్ దాన్ని నిలబెట్టుకున్నారని అన్నారు. ఈ నిర్ణయం గిరిజనుల అభివృద్ధికి దోహదం చేస్తుంది అని పేర్కొన్నారు.శాసన సభలో రిజర్వేషన్లు పెంచాలని తీర్మానం చేసి,కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పటికి, రాష్ట్ర మంత్రి వర్గం, ఎంపీల బృందం పలుమార్లు కేంద్రాన్ని కోరినప్పటికీ బిజెపి ప్రభుత్వం పట్టిచుకోకుండా కాలయాపన చేసిందని విమర్శించారు.ఈ క్రమంలోనే సిఎం కేసీఆర్ దైర్యంగా 10 శాతం రిజర్వేషన్లు పెంపు,వాటి అమలుకు నిర్ణయం తీసుకోవడం గిరిజన అభివృద్ధి పట్ల, సిఎం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు . దశాబ్దాలుగా గిరిజనులు సేద్యం చేసుకుంటున్న పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకొని గిరిజనులకు భూమి హక్కు పత్రాలు, రైతుబంధు ఇవ్వాలని నిర్ణయించారని ఆయన తెలిపారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎస్టి గురుకులాలు, విదేశీ విద్య కోసం 20 లక్షల ఆర్థిక సహాయం అందించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సినప్పటికీ బిజెపి ప్రభుత్వం దానిని ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేయడాన్ని విమర్శించారు. బయ్యారం ఫ్యాక్టరీకి నిధుల కేటాయింపుల్లోని మోడీ ప్రభుత్వం వివక్ష చూపుతుందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో
జయరాం నాయక్, గిరిజన నాయకులు పాల్గొన్నారు.