గిరిజన వితంతు మహిళా సమస్యలను పరిష్కరించాలి
గూడూరు, జూన్ 6:
బుధవారం మండల కేంద్రంలో వితంతుల సదస్సు మండల కార్యదర్శి వాంకుడోతు భరత్‌నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సంద ర్భంగా రాజన్న మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక గిరిజన తండాలలో అనేక మంది ఆర్థిక భారం మో యలేక వితంతులు ఇబ్బందలు పడుతూ వలసలు పోతున్నారని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. వారి పిల్లలకు కనీసం విద్యను అందించలేని పరిస్థితిలో ఉన్నారని ప్రభుత్వం గిరిజన వితంతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అందరికి విద్య అని చెప్పడం త ప్పు ఆచరణలో కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యిందని ఆయన ఆరోపించారు. వితంతులకు ఫింఛన్ అందించడంలోకూడా విఫలం చెందిందన్నారు. వితంతులకు వెయ్యి రూపాయలు పింఛన్ అందించాలని డిమాండ్ చేసి వినతి పత్రాన్ని తహశీల్దార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధార వత్ లక్ష్మి, దాలి, లక్ష్మి, భద్రు, వినోద, భద్రమ్మ, గోలి, గులమ్మ, అలీ తదితరులు పాల్గొన్నారు.