గిరిజన సంక్షేమానికి చర్యలు

నిర్మల్‌,మార్చి19(జ‌నంసాక్షి):  గిరిజన అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఐటిడిఎ పివో అన్నారు. పీటీజీల అభివృద్ధికి ఐటీడీఏ ఆధ్వర్యంలో సీసీడీపీ నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. 58 సంవత్సరాలు నిండిన గిరిజన కళాకారులను పింఛన్‌ సౌకర్యం ఉందని, లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు  తెలిపారు. గిరిజన
గ్రామాల్లో డ్రాపౌట్లు లేకుండా డైరెక్టర్లు సహకరించాలన్నారు. అలాంటి పిల్లలను నేరుగా పాఠశాలలో చేర్పించాలన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు గిరిజనులకు అందేలా డైరెక్టర్లు సహకరించాలన్నారు.  గిరిజన వ్యవసాయ భూములను అభివృద్ధిపర్చేందుకు వ్యవసాయ బోరుబావులు, విద్యుత్‌ కనెక్షన్‌ ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు  మంజూరు చేసిందన్నారు.  ఉపాధ్యాయులు లేని చోట సర్దుబాటుచేయాలని ఆదేశించారు. నీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలన్నారు. అత్యవసర సమయాలలో ఉన్న వ్యక్తులకు నేరుగా జిల్లా కేంద్రానికి తరలించాలని ఏజెన్సీ వైద్యాధికారికి సూచించారు.