.గిరీష్‌ను చంపుతాం..
– కల్బుర్గీకి పట్టినగతే పడుతుంది
– అంతర్జాతీయ విమానశ్రాయానికి టిప్పుసుల్తాన్ పేరు పెట్టమన్నందుకు రెచ్చిపోయిన మతోన్మాదులు
బెంగళూరు, నవంబర్ 12 (జనంసాక్షి) : బెంగళూరు అంతర్జాతీయ విమానశ్రాయానికి టిప్పసుల్తాన్ పేరు పెట్టమన్నందుకు కర్నాటఖ రచయిత గిరీష్ కర్నాడ్ చంపేస్తామని, మతోన్మాదులు హెచ్చరించారు. టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా బెంగలూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని గిరీష్ ఓ సభలో డిమాండ్ చేశారు. దీంతో కర్నాటక రచయిత కల్బుర్గి, మహారాష్ట్రలో పన్సారేకు పట్టిన గతే పడుతుందని ట్విట్టర్‌లో గిరీష్ కర్నాడ్‌ను కొందరు హెచ్చరించారు.
‘ఇన్‌టోలరెంట్ చంద్ర’ అనే యూజర్ నేమ్‌తో…
తన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో.. 77 ఏళ్ల గిరీష్ కర్నాడ్ క్షమాపణలు చెప్పారు. ఎవరైనా తన వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడితే క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. దీంతో ట్వీట్‌లోని హెచ్చరికలను డిలీట్ చేశారు. ‘ఇన్‌టోలరెంట్ చంద్ర’ అనే యూజర్ నేమ్‌తో ట్విట్టర్‌లో గిరీష్ కర్నాడ్‌ను హెచ్చరిస్తూ పోస్టింగ్ వచ్చిందని, దీనిపై ఏమైనా ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. గిరీష్ కర్నాడ్ ఇంటివద్ద భద్రతను పెంచారు.
టిప్పు జయంతి ఉత్సవాలు.. వివాదాస్పదం..
18 వ శతబ్దానికి చెందిన పరిపాలకుడు టిప్పుసుల్తాన్ జయంతి ఉత్సవాల నిర్వహణ కర్నాటకలో వివాదాస్పదమైంది. టిప్పు సుల్తాన్ వేడుకలను వ్యతిరేకిస్తూ ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి చేస్తున్న నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. పోలీసు లాఠీ చార్జీ, కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వీహెచ్‌పీ కార్యకర్తతో మరొకరు మృతి చెందారు. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను రద్దు చేసే ప్రసక్తే లేదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య స్పష్టం చేశారు. టిప్పు సుల్తాన్ హిందు, క్రైస్తవులను ఆదరించిన సెక్యులర్‌వాదిగా పేర్కొన్నారు.