గీత కార్మికులకు గీత బంధు ప్రకటించాలి
– సోషల్ మీడియా రాష్ట్ర కో కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్
చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 02 : గీత కార్మికులకు గీత బంధు ప్రకటించాలని కేజీకేఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కో కన్వీనర్ మేరిండ్ల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం వారు “జనంసాక్షి”తో మాట్లాడుతూ.. ఎప్పుడు చెట్టుపై నుంచి పడుతారో తెలియని ప్రమాదకరమైన వృత్తిలో గీతా కార్మికులు దిన దిన గండంగా బతుకుతున్నారని, అన్ని రంగాల్లో ఆధునికీకరణ ఉన్నప్పటికీ తాటి చెట్టు ఎక్కడానికి ఆధునికీకరణ యంత్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో 5ఎకరాల భూమి కేటాయించి కర్జురా, గిరుక తాటి చెట్లు పెంపకం చేపట్టాలని, ప్రకృతి ప్రసాదించిన సర్వరోగ నివారణ తాటి కల్లుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతీ జిల్లాకు నీరా ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేసి కార్మికులకు జీవనోపాధి కల్పించాలన్నారు. చనిపోయిన తర్వాత అతని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం కాకుండా ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని, గీత కార్మికులకు గీత బంధు ప్రకటించి ప్రభుత్వం ఆదుకోవాలని, ఇతర కుల వృత్తులకు ఇచ్చిన మాదిరిగా సబ్సిడీ పరికరాలు, ద్విచక్రవాహనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
Attachments area