గుంజేడు ముసలమ్మ ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
కొత్తగూడ సెప్టెంబర్ 14 జనంసాక్షి:మండల కేంద్రంలోని గుంజెడు ముసలమ్మ సన్నిధిలో గూడూరు ఎంపిపి సుజాత,మోతిలాల్ గుంజేడు శ్రీ శ్రీ శ్రీ ముసలమ్మ కు మొక్కులు చెల్లించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ముసలమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ ఈ కార్యక్రమంలో జెడ్పి కో ఆప్షన్ ఎండి ఖాసీం,లింగా రెడ్డి,వెంకట్ కృష్ణ రెడ్డి,లక్ష్మణ్ రావు, సురేందర్,వేణుగోపాల్ రెడ్డి,సర్పంచులు,ఎంపిటిసిలు,పా ర్టీ గ్రామ,మండల నాయకులు తదితరులు ఉన్నారు.