గుండం పెళ్లిలో భూభారతి- భూ, రీసర్వే పై అవగాహన సదస్సు

మల్లాపూర్, జులై17 (జనంసాక్షి): భూభారతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో చేపడుతున్న భూ రీ సర్వే తో భూ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయని తాసిల్దార్ రామ్ చందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని గుండంపల్లి గ్రామంలో శుక్రవారం రోజున భూభారతి భూ రిసర్వే కార్యక్రమం పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూg భూమికి సంబంధించిన గ్రామ హద్దులు ఇతరత్రా సమస్యలు భూ రిసర్వే తో సర్వే నెంబర్లతో కూడిన గ్రామ మ్యాప్ , రైతుల భూ పరిష్కారం అవుతాయని అన్నారు. గ్రామ హద్దులను ఏర్పాటు చేసి రీ సర్వే వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఈయన వెంట ఆర్ఐ అశోక్, సర్వేయర్ కుమారస్వామి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.



