గుండాల మండలంలో భారీ వర్షం –
-పలు గ్రామాలకు రాకపోకలు బంద్
గుండాల,సెప్టెంబర్11(జనంసాక్షి);గుండాల మండలంలో శనివారం నుంచి భారీ వర్షం కారణంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి.గుండాల నుండి కోడవటంచ గ్రామానికి మధ్యలో ఉన్న కిన్నెరసాని ఉదృతంగా ప్రవహిస్తుండగా గ్రామస్థులు ఇప్పటికి అయిన హై లెవెల్ వంతెన నిర్మించాలని అధికారులని కోరుతున్నారు. వర్షం కారణంగా ప్రతి సారి లో లెవెల్ వంతెన పై రాకపోకలు నిలిచిపోతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.