గుండెపోటుతో రైతు మృతి
సంగారెడ్డి, జనవరి 31 (): గజ్వేల్ పత్తిమార్కెట్లో గురువారంనాడు ఒక యువరైతు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఆయన పేరు కనకయ్య(25), దౌలతాబాద్‌కు చెందిన రైతు కనకయ్య పండించిన పత్తిపంటను విక్రయించేందుకు గజ్వెల్ పత్తిమార్కెట్‌కు పంటను తెచ్చాడు. అతనితో పాటు తోటి రైతులు కూడా పత్తిని అమ్ముకునేందుకు వచ్చారు. గురవారం ఉదయం ఆకస్మాత్తుగా కనకయ్య కిందపడిపోయాడు. తోటి రైతులు పలకరించినా లేవకపోవడంతో వెంటనే వారు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్‌లో వచ్చిన డాక్టర్ విలియమ్స్ కనకయ్యను పరీక్షించగా అప్పటికే ఈయన చనిపోయాడని వెల్లడించారు. కింద పడిపోయినప్పుడే గుండెపోటు వచ్చిందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని రైతు కుటుంబసభ్యులకు సమాచారాన్ని తోటి రైతులు అందించే ప్రయత్నంలో ఉన్నారు.