గుంతలతో,బురదమయంగా ఉన్న రోహీర్ ప్రధాన రహదారి అధికారులు వెంటనే స్పందించి రోడ్ మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేసిన మండల కాంగ్రెస్ నాయకులు

ఏటూరునాగారం(జనంసాక్షి)ఆగస్టు22.
ఈ రోజున కాంగ్రెస్ జిల్లా అసెంబ్లీ కోర్డినేటర్ ఇర్సవడ్ల వెంకన్న మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిటమట రఘు సూచనల మేరకు మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య ఆధ్వర్యంలో, రొయ్యూరు గ్రామంలో మిషన్ భగీరథ సమీపంలో ఉన్నటువంటి రోడ్ రహదారిని పరిశీలించిన మండల కాంగ్రెస్ నాయకులు.
ఈ సందర్బంగా మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య మాట్లాడుతూ మిషన్ భగీరథ సమీపంలోని రహదారి గుంతలతో, బురదమయంగా అధ్వానంగా ఉన్నదని తుపాకులగూడెం, కన్నాయిగూడెం,చల్పాక ఇంకా చుట్టు పక్కల ఇతర గ్రామాలన్ని ఏటూరునానాగారం రావాలంటే ఈ దారి నుండి రావాలని అన్నారు. అదేవిధంగా గ్రామస్తులు, వాహనదారులు ఇటువంటి రహదారి నుండి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేయించాలని, ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య,జిల్లా కిసాన్ సెల్ కార్యదర్శి మాడుగురి ప్రసాద్,జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి కొండగొర్ల పోషయ్య, మండల ఉపాధ్యక్షులు ఎండీ రియాజ్, టౌన్ అధ్యక్షులు ఎండీ సులేమాన్, వర్కింగ్ టౌన్ అధ్యక్షులు సరికొప్పుల శ్రీనివాస్,మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ సిరాజ్,టౌన్ యూత్ అధ్యక్షులు బండారి లక్కీ,జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా గద్దల నవీన్, మండల సహాయ కార్యదర్శి ముమ్మానేని రమేష్ -సయ్యద్ యాఖుబ్ పాషా,రోహీర్ గ్రామ అధ్యక్షులు కావిరి మొండయ్య,వార్డ్ మెంబెర్ కొండగొర్ల నర్సింహులు,డోంగిరి ప్రకాష్, ఫారూక్, గ్రామ యూత్ అధ్యక్షులు దుర్గం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.