గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండ.. ముస్లింవాద కవి ఆక్రందన… గోద్రా ముస్లింల ప్రశ్నలు
– ‘సబర్మతి బోగి ప్రీప్లాన్డ్‌గా తగలబెట్టబడిందని అందరూ అంటున్నారు. పత్రికలన్నీ రాశాయి,దీదీఖు పవ షష్ట్రశీఎ?
-‘సబర్మతి సంఘటనను సిబిఐ చేత ఎందుకు విచారణ జరిపించడం లేదు??’
-‘ముస్లింలను, ముస్లింల ఇండ్లనూ, షాపుల్ని, హోటళ్లను వాహనాలను తగలబెట్టడడానికి గుజరాత్ అంతటా ఒకే రకమైన కేమికల్ ఎలా సరఫరా అయ్యింది? ఆ కెమికల్‌కి ఎక్కువ సేపు తగబడే గుణం ఉంది కాబట్టే ముస్లింల శవాలు బూడిద కకుప్పలైపోయాయి.బోగి కూడా ఎక్కువసేపు (2 నుంచి 3 గంటలు) తగలబడిందంటే అందులోనూ ఆ కెమికల్ వాడబడిందా? అసలా కెమికల్ గుజరాత్ భూకంపంలో చనిపోయిన శవాల్ని (గుట్టలుగా పడేసి) తగలబెట్టడానికి తెప్పించాన కెమికల్ అంటున్నారు. నిజమేనా? అసలు ఒక్కరోజులోనే ఆ కెమికల్ అన్ని ప్రాంతాలకు ఎలా సరఫరా అయింది?’
-‘ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ప్రకారం భోగి లోపలినుంచే తగలబెట్టబగిందని చెప్తున్నారు కదా?’
-‘ఎముకలు కూగా మిగలకుడా ముస్లింలను తగలబెట్టారు. అలాంటి కేసులన్నింటిని పోలీసులు మిస్సింగ్ అని రాసుకొని చనిపోయిన వాళ్ల సంఖ్యను అతి తక్కువగా చూపు తున్నారు. అసలు గుజరాత్ మొత్తంగా మిస్సింగ్ సంఖ్య ఎంత? ఉదాహరణకు గోద్రాకు దగ్గర్లోని డెలోల్ గ్రామంలో 37 మందిని ముక్కలుగా నరికి తగలబెట్టారు. అందులో 25 మందిని పోలీసులు మిస్సింగ్ అని రాసుకున్నారు. గోద్రా దగ్గర్లోని మరో ఊరిలో 450 మంది కనిపించడం లేదు. సబర్‌కాంటా జిల్లా కిడియాద్ ఊరివాళ్లను 74 మందిని తగలబెడితే 62 మందిని మిస్సింగ్ అని రాసకున్నారు. సర్దార్‌సూర్‌లో 33 యందిపి తగలబెట్టారు. జాఫ్రీ ఇంట్లో 200 నుంచి 250 మంది దాచుకుంటే చంపబడింది ఎంతమందో లెక్కేలేదు. పత్రికల్లో కేవలం జాఫ్రీీ కుటుంబ సభ్యులు 28 మందే చంపబడినట్లు వచ్చింది..’
-‘తిరిగి ఇదే తరహాలో మా మీద దాడులు జరగకుండా ఉండాలంటే మేమేం చెయ్యాలి?’
గుజరాత్ లో మొత్తం ముప్పైవేల మందిదాక ముస్లింలు హత్యలు చేయబడినట్లు అర్థమైంది.వందల సంఖ్యలో స్త్రీలు అమ్మాయిలు రేప్‌కి గురైయ్యారు.వాళ్లలో చాలా తక్కువ మంది బతికివున్నా రు.లక్షల మంది ముస్లింలు అన్నీ కోల్పోయి జఖ్మీ దేహలు మాత్రమే మిగిలి తిండికీ నీడకూ తల్లడిల్లుతున్నారు. రేపు ఇతర రాష్ట్రాల్లోనూ ముస్లింలకు ఇలాంటి పరిస్థితే ఎదురుకానుందని సంకేతాలు అందుతున్నాయి. మరి ఇట్లాంటి విషమపరిస్థితిలో సభలో సమావేశాలో సంకలనాలో మాత్రమే రేపటి ప్రమాదాన్ని నివారిస్తాయని అనుకోవడం లేదు.
వాళ్లు బాబ్రీ మసీద్ నేలమట్టం చేశారు. – మనం నిరసన తెలిపాం. వాళ్లు బొంబాయిలో ముస్లింలను ఊచకోత కోశారు. ఆ విశయాన్ని బట్టబయలు చేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమీషన్ ను బుట్టదాఖలు చేశారు. – మనం నిరసన తెలిపాం. వాళ్లు ఇవాళ గుజరాత్ సృష్టించారు. – మనం నిరసన తెలుపుతూనే ఉందామా?! ముస్లింలను చంపేవాళ్లు వేరే వున్నారు. చంపిస్తున్నవాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ల దగ్గరికి వెళ్లే ఫ్రోగ్రాం ఏది మన దగ్గర?? లేనప్పుడు ఇక ముస్లింల ప్రాణాలను ఎవరూ కాపాడలేరు.!
వందేళ్ల రిజర్వేషన్ పండుగలు చేసుకుంటున్న సదర్భంలో ఉన్నాం. గుజరాత్‌లో దళితులు వాడుకోబడ్డారని వాళ్ల తప్పేమి లేదన్నట్లు దలిత నాయకులు మాట్లాడుతారు. ఆదివాసీలు వాడుకోబడ్డారని మేధాపాట్కర్ కూడా బాధపడతారు. ఇక బీసీలు
– గుజరాత్ ముస్లింల దగ్గర ఎక్కడామేము బీసీల ప్రస్తావన కూడా తేలేకపోయాం
– పటేళ్లు, ఠాకూర్లు, భ్రాహ్మణు లతోపాటు దాడులకు అత్య ధికంగా నాయకత్వం వహించి ంది బీసీలే… అందుకని బిసీ లెవరూ మాట్లాడరు. మొత్తానికి వేల మందిని పొట్టనబెట్టుకున్న పాపంలో, లక్షలమందికి అన్న ం, నీళ్లూ లేకుడా చేసిన పాపంలో, వేలమంది పసి పిల్లల్ని అనాధల్ని చేసిన పాపం లో మిత్రులనుకున్న వాళ్లందరి చెయ్యే ఉంది. దానికి ప్రతిగా ఇక్కడ ఆయా వర్గాల నాయ కుల ప్రోగ్రాం ఏమిటి??
ఏళ్లనుంచి వింటున్నాం
– ‘రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామంటున్న వివిధ పార్టీల గురించి… ఇవాళ రాజ్యం ఆరెస్సెస్… దేశంలో గాని గుజరాత్‌లో గానీ..! ఆరెస్సెస్ ను మోస్తు న్న బోయీ ల పాత్ర నిర్వహి స్తున్న ఎన్డీయే మిత్రపక్షాలు కూడా ఆరెస్సెస్ భావజాలాన్ని మోస్తున్నట్లే కదా.. అట్లాంట ప్పుడు మరి రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతు న్నా మంటున్నపార్టీలు పోరా డాల్సిందిఆరెస్సెస్‌తో కదా..?
మరి ఒక్క బహిరంగ ప్రకటన ైనా ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా ఇవ్వడానికి ఆయా పార్టీలెందుకు సిద్ధంగా లేవు?? ఆయా పార్టీల్లోని కొన్నింటిలో మహిళా సంఘాలుంటాయి, కుల సంఘాలుంటాయి.. మరి మైనా రిటీ సంఘాలెందుకు లేవు?? అణచివేత కన్నా నిర్మూలన ఇంకా తీవ్రమైన సమస్య కాదా?? గుజరాత్ కాంగ్రెస్ పార్టీ హిందువుల ఓట్లకోసం మౌనంగా ఉన్నట్లే, హిందువుల మద్దతు ‘పూర్తిగా(?)’ ఎక్కడ కోల్పోతామో నని ఆయా పార్టీలు భయపడుతు న్నాయనుకోవాలా?? శత్రువు స్పష్టంగా ఉన్నాడు. మిత్రుల స్పష్టత విషయంలోనే అనుమానంగా ఉంది. మిత్రుల స్పష్టత విషయంలోనే అనుమానంగా ఉంది. మిత్రుల నుంచి బహిరంగ ప్రకటనలు కావాలి మాకు !
మనది లౌకిక దేశమనే ముస్లింలు ఇంకా నమ్ముతున్నారు. తమకు అన్యాయం జరిగితే మాట్లాడేవాళ్లున్నారనే వాళ్లింకా నమ్ముతున్నారు. కాని దాడులంటూ జరిగితే అంతా తలుపులు బిగించుకుంటారని, ఎవరూ రారని గుజరాత్ నిరూపించింది. అక్కడి కాంగ్రెస్ పార్టీ, కార్మిక సంఘాలూ, ప్రోగ్రెసివ్ ‘మనుషులూ’ ఎవరూ దాడుల్ని ఆపలేకపోయారు. (దాడులు నిర్వహించినవాళ్లు తమ ప్లాన్ ప్రకారం మూడు నెలలు నిరాటంకంగా వాటిని కొనసాగించారు). ఇక ఎక్కడైనా అంతే జరగదని నమ్మకమేమిటి? ఈ పరిస్థితుల్లో ప్రగతి వాదులూ, అభ్యుదయవాదులూ, కమ్యూనిస్టులూ, దళిత బహు జన ఆదివాసీ మేధావులూ మౌనం వీడి తాము ఖచ్చితంగా ఎటు పక్షమో బహిరంగంగా తేల్చి చెప్పాల్సిన తరుణమిది. దాంతోనైనా ముస్లిం లకు ఒక స్పష్టమైన దారి కనిపించే అవకాశం ఉంది.
గొంతు మీద కత్తి
పలకమంటున్న పదాలు
జై శ్రీ రాం
గొంతు తెగి పోతున్నా
లొంగని ధిక్కారమే
రేపటి ఆశ
– స్కైబాబా