ఖమ్మంలో సంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

ఖమ్మం, ఏప్రిల్ 21, (జనంసాక్షి) : ఖమ్మం పట్టణంలోని స్వయంభూ క్షేత్రమైన శ్రీ సంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం (గుట్ట)లో ఈ నెల 28 నుండి మే 2వ తేదీ వరకు నిర్వహింపబడనున్న శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ గౌరవనీయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని మంగళవారం ఆలయ నిర్వాహకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమమునకు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ డా. కూరపాటి ప్రదీప్ కుమార్, కార్యనిర్వహణాధికారి జగన్మోహనరావు, కమిటీ సభ్యులు రవి , సాయి, చల్ల మధు, నాగేంద్ర, సీతారాములు, రాధికా తదితరులు హాజరయ్యారు. అర్చకులు నరహరి రామకృష్ణ చార్యులు, వేదపండితులు సాయిరాం శర్మ పాల్గొని కార్యక్రమమునకు వేద ఆశీర్వాదం ఇచ్చారు. స్వామివారి అనుగ్రహంతో బ్రహ్మోత్సవములు వైభవోపేతముగా నిర్వహింపబడునని నిర్వాహకులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ తెలిపారు.