సీఎం ను సన్మానించిన ఎమ్మెల్యే గండ్ర దంపతులు
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని సోమవారం రాత్రి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, పద్మ దంపతులు శాలువాతో సన్మానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నుస్తూర్ పల్లిలో రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల, బహిరంగ సభ కార్యక్రమాన్ని ముగింపు అనంతరం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, పద్మ దంపతుల ఆహ్వానం మేరకు సోమవారం రాత్రి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా టిపిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ తదితరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.



