గుజరాత్‌, హిమాచల్‌ ఎన్నికల పై ఈసీ మీడియా సమావేశం

ఢిల్లీ: గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల శాసనసభల ఎన్నాకలపై ఎన్నికల కమిషన్‌ ఈ రోజు ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పరిశీలించినట్లు పేర్కొంది. గుజరాత్‌లో 182 శాసనసభ స్థానాలు ఉండగా, హిమాచల్‌ ప్రదేశ్‌లో 68 శాసనసభ స్థానాలున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులే ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలని ఈసీ పేర్కొంది.