*గుడుంబా పట్టివేత.

ఒకరిపై కేసు నమోదు.
* ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ .
చిట్యాల 16(జనం సాక్షి) ప్రభుత్వ నిషేధిత గుడుంబాను పట్టుకొని, ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఆదివారం ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని జడల్ పేట శివారు భీష్మ నగర్ వద్ద తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా భూపాలపల్లి మండలం లోని పెద్ద కుంటపల్లి గ్రామానికి చెందిన అజ్మీర సాంబయ్య తారాసపడగా అతనిని తనిఖీ చేయగా అతని వద్ద 20 లీటర్ల గుడంబా లభ్యం కాగా దానిని పట్టుకొని సీజ్ చేసి, స్టేషన్ కు తరలించి అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.