గుడులు, మసీదులు చర్చిలకు కట్ చేసిన విద్యుత్ ను వెంటనే పునరుద్ధరించాలి : కాంగ్రెస్ పార్టీ డిమాండ్
అయిజ, అక్టోబర్ 20 (జనం సాక్షి:
అయిజ మండల,మరియు మున్సిపాలిటీ పరిధిలోని గుడిలు, మసీదు, చర్చిలకు ఉన్న విద్యుత్ కనెక్షన్లను కట్ చేయించిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ వెంటనే పునరుద్ధరించాలని మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ కార్యదర్శి మాస్టర్ షేక్షావలి ఆచారి, ఆలయాల పెద్దలతో కలిసి విద్యుత్ కార్యాలయానికి వెళ్లి ఏఈ, తో వాదించారు. ఈ సందర్భంగా షేక్షావలి ఆచారి మాట్లాడుతూ.స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఎన్నడూ లేని విధంగా ఈ రోజు రాష్ట్రంలోనే కాదు మన ఐజ మండల పరిధిలోని అనేక గుడులు మసీదులు చర్చిలకు ఉన్న విద్యుత్ కనెక్షన్ ను అర్థాంతరంగా కట్ చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అన్ని ఆధ్యాత్మిక ఆలయాలకు విద్యుత్ ను తీసివేసిన అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని షేక్షావలి చారి హెచ్చరించారు .వెంటనే పునరుద్ధరించకపోతే సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన .అధికారులు ప్రభుత్వాల మెడలు వంచైనా ప్రజలకు న్యాయం చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పట్టణ బిసి సెల్ జిల్లా అధ్యక్షులు సాంబశివుడు ,నాయకులు బసవరాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఫిరోజ్, శాలి ఫైల్ మాన్ శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కమిటీ పెద్దలు మరియు తిక్క వీరేశ్వర దేవాలయ కమిటీ వారు మాల పేట లోని ఆంజనేయ స్వామి కమిటీ పెద్దలు మసీదు పెద్దలు చర్చి సంఘస్తులు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .