గుప్తనిధుల కోసం తవ్వకాలు, ఆరుగురి అరెస్ట్
విశాఖ : విశాఖ జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. భీమిలీ సమీపంలోని అతిపురాతన నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.



