గురప్ప వాగుపై వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి
మునగాల, జూలై 9(జనంసాక్షి): మునగాల మండలం తాడువాయి గురప్ప వాగుపై రహదారి ప్రయాణానికి ఆటంకం కలగడంతో వెంటనే బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని మునగాల మండల భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కోల ఆంజనేయులు శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల కొలుస్తున్న వరుస వర్షాలకు గురప్ప వాగు అలుగు పోస్తుండడంతో రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఏర్పడినదని, ఇంకా పెరిగే అవకాశం ఉందని, ప్రయాణీకులు, పాదచారులు, ఈ మార్గము గుండా వెళ్తున్న ప్రజానీకానికి దగ్గరుండి సూచనలను అందిస్తున్నారు. ఈ బ్రిడ్జిపై తాత్కాలిక వంతెనలు ఏర్పాటు చేయాలని తాడువాయి, వెంకటరామపురం, నేలమర్రి గ్రామస్తులు కోరుతున్నారని అన్నారు. వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర కార్మికులు, మిల్లుల్లో పనిచేసే వారు చాలా ఇబ్బంది పడుతున్నందున ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, ఏ వాహనం రావాలన్నా, తిరిగి వెళ్లాలంటే మాధవరం నుండి తిరిగి రావాల్సి వస్తుందని, సుమారు ఎన్నో కిలోమీటర్లు తిరిగి పని ముగించుకుని చీకట్లో వచ్చేటప్పుడు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తమ ఇబ్బందిని గుర్తించి తమకు సకాలంలో న్యాయం చేయాలని పలు గ్రామాల కార్మికులు, ప్రయాణీకులు, పాదచారులు కోరుతున్నారని అన్నారు