గురవయ్య మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు
జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి
హుజూర్ నగర్ సెప్టెంబర్ 12 (జనం సాక్షి): గురవయ్య మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని హుజూర్ నగర్ జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి అన్నారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు సురభి గురవయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకోవడం జరిగిందని తెలియజేశారు. వీరి ఆరోగ్యం విషమించి తుది శ్వాస విడిచారన్నారు. సురభి గురువయ్యను బతికించుకోవడం కోసం కుటుంబ సభ్యులతో పాటు హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి కూడా ప్రయత్నం చేశారన్నారు. వారి వైద్యం కోసం ప్రభుత్వం నుంచి ఎల్ వో సి ఇప్పించి ఆర్థికంగా సహకరించారన్నారు. అయినా వారిని బతికించుకోలేకపోయాం అని ఆవేదన వ్యక్తం చేశారు. గోపాల పురం గ్రామంలో గురవయ్య ఇంటికి వెళ్లిన హుజూర్ నగర్ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ముడెం గోపిరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు చావా వీరభద్రరావు లు గురువయ్య పార్థివ దేహం పై పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురవయ్య మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారులు కడియాల రామకృష్ణ, స్థానిక ఎంపీటీసీ చీకూరి రాజారావు, దేవస్థానం చైర్మన్ చీకూరి సోమయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు హుస్సేన్ మియా, మాజీ సర్పంచ్ తిరుపయ్య, టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు సుందరయ్య, సత్తిబాబు, కొండల్ తదితరులు ఉన్నారు.