గురుకులాలతో తెలంగాణలో కొత్త అధ్యాయం

మహబూబ్‌నగర్‌,జూన్‌15(జ‌నం సాక్షి ): సీమాంధ్ర పాలనలో తెలంగాణలో విద్యారంగం వెనుకబాటుకు గురైందని ప్రణాళికా సంఘం డిప్యూటి ఛైర్మన్‌ నిరంజన్‌ రెడ్డి అన్నారు. గురుకులాల ఏర్పాటు తెలంగాణలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించబోతున్నాయని అన్నారు. పాఠశాలలో అర్బన్‌ పిల్లలకు, సెవిూ అర్బన్‌ పిల్లలకు, చైల్డ్‌ లేబర్‌, బడి బయట ఉన్న బడిఈడు పిల్లలు చేరేందుకు అవకాశం ఉందన్నారు.రాష్ట్రంలో వెనుకబడిన తరగతులతో పాటు మైనార్టీలకు రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్‌ ఆత్మబంధువ య్యారని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయం, మైనారిటీ గురుకుల విద్యాలయాలు వీరికి అవకాశాలు పెంచాయని నాడిక్కడ అన్నారు. జ్యోతిబాపూలే బీసీ వర్గాల సంక్షేమం కోసం పోరాటం చేశారన్నారు. ఎస్సీలకు ఆదర్శప్రాయుడు బీఆర్‌ అంబేడ్కర్‌ కాగా, బీసీలకు జ్యోతిబా పూలే అన్నారు. విద్యార్జనలో మైనారిటీలు పూర్తిగా వెనకబడి ఉన్నారని, వారికి విద్యాబోధన చేయించి ఉన్నతులుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని అన్నారు. మైనారిటీల్లో కేవలం 10శాతం మంది కూడా విద్యాభ్యాసం చేయడం లేదని ఆవేదనవ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్‌ గురుకులాల నిర్ణయంతో అందరికి విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు.