గురుకులాలలో గిరిజన విద్యార్థులకు సీట్లు కేటాయించాలని లంబాడి విద్యార్థిసేన డిమాండ్
చింతలపాలెం — జనంసాక్షి
తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో దరఖాస్తు చేసుకున్న గిరిజన విద్యార్థులకు సీట్లు రాక అవస్థలు పడుతున్నారని దరఖాస్తు చేసుకున్న ప్రతి గిరిజన విద్యార్థికి స్కూలు,కాలేజీలలో సీట్లు కేటాయించాలని లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు మూడవత్ రవిచంద్ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.రాష్ట్రంలో గురుకుల సీట్లు కోసం పరీక్షలు రాసినటువంటి చాలామంది గిరిజన విద్యార్థులకు గురుకులాల్లో సీట్లు కావాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదని,దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ సీట్లు వచ్చే విధంగా ప్రత్యేకంగా గురుకులం స్కూలు, కాలేజీల్లో సీట్లు పెంచి అందరికీ సీట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గిరిజన విద్యార్ధుల కోసం సీట్లు ఇవ్వాలని ఎంపీలు,ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆశావహులు చెబుతున్నారని అన్నారు.వేలాది దరఖాస్తులు వస్తున్నప్పటికీ తెలంగాణ గిరిజన గురుకులం సెక్రెటరీ పట్టించుకోవడం లేదని వచ్చినటువంటి దరఖాస్తులను పరిగణలోకి తీసుకొని అందరికీ సీట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. తెలంగాణ గిరిజన గురుకులంలో సీట్లు వస్తుందని ఆశతో హైదరాబాదుకు విద్యార్థుల తల్లిదండ్రులు బంధువులు వందల సంఖ్యలో వచ్చినా వారికి సీట్లు రాకపోవడంతో దరఖాస్తులు ఇచ్చి వెళ్లిపోవడం జరుగుతున్నదని,సీట్లు వస్తుందనే విద్యార్థులు ఆశపడడంతో చదువుకు ఆటంకం కలుగుతుందని అన్నారు.వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించి గురుకుల సెక్రటరీ అందరికీ సీట్లు కేటాయించే విధంగా తగు చర్యలు తీసుకొని విద్యను కొనసాగించేలా చూడాలని మూడవత్ రవిచంద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేని యెడల ఆందోళనలు,పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.