గురుకులాల్లో మిగిలిన సీట్లకు నే డు కౌన్సిలింగ్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌22(జనం సాక్షి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2023`24 విద్యా సంవత్సరంలో 5 నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 23న ఎస్సీ బాలబాలికలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.వీటీజీ సెల్‌`23, బీఎల్‌వీ సెల్‌`23లో ప్రతిభ చూపి, సీటు వచ్చి జాయిన్‌ కాలేని వారు, ఎస్సీ కేటగిరీలో అర్బన్‌, సెవిూ అర్బన్‌, దివ్యాంగులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. విద్యార్థులు సీటు వచ్చిన కాపీ, హాల్‌ టికెట్‌, ఆధార్‌ కార్డు, స్టడీ సర్టిఫికెట్లతో ఈనెల 23న బాలికలు చింతకుంట గురుకుల పాఠశాలలో, బాలురు స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (అల్గునూర్‌)లో ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.