గురుకుల సంఘీక సంక్షేమ పాఠశాలను,కస్తూర్బా పాఠశాలను సందర్శించిన :-
గట్టు జూలై 01 (జనంసాక్షి):- గట్టు మండలం లో ఉన్న గురుకుల సంఘీక సంక్షేమ పాఠశాలలో గత వారం నుండి బాలికలు వాంతులు మరియు అనారోగ్యతో ఉన్న పిల్లలను సందర్శించి అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ ను వంట గది మరియు మిషన్ భగీరథ నీళ్లను ట్యాంక్ ద్వార కాకుండా అక్కడ నుండి వేరే పైపులైన్ ద్వారా నీటిని సప్లైయి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు.అదేవిదంగా విద్యార్థుల తో కలసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్, ఎంపీపీ,డిఎంహెచ్ఓ లు చేశారు. వాటితో పాటు వంట శాలను డైనింగ్ హాలుకు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గట్టు ఎంపీపీ విజయ్ కుమార్, జిల్లా డిఎంహెచ్ఓ చందు నాయక్,సర్పంచ్ ధనలక్ష్మి, డిఈ మొహినిద్దిన్,గట్టు తహశీల్దార్ సహదేవ్,రాయపురం ఎంపీటీసీ రంగస్వామి, టీఆరెస్ పార్టీ సీనియర్ నాయకులు అంగడి బస్వరాజు, గట్టు డాక్టర్లు రాజసింహ,ప్రిన్సిపల్ వాణి, గుంటిగోపి లత,తదితరులు పాల్గొన్నారు.