గురుపౌర్ణమి ఉత్సవాలకు ముస్తాబవుతున్న సాయినాథ్ మందిరము

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూలై 11(జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ లోని ఖానాపూర్ వద్ద కొలువైయున్న సద్గురు సాయినాథ్ ఎకశిల మందిరము నందు 12,13,14 తేదీలలో గురుపౌర్ణమి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు అభిషేకాలు, మూడు రోజు లపాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించెదరు. ప్రతి రోజు స్వామి వారికి పంచ అమృత అబిషెఖము నిర్వహించబడుతుంది. నిత్యము దుఫ దిపా నైవేద్యాల తో ప్రతి గురువారం వందాలది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహింపబడుతున్న ఇట్టి క్షేత్రము పిలిచిన వెంటనే పలికె, కోరిన కోరికలు తిర్చె దైవం గా ప్రసిద్ది చెందినది. ఇట్టి క్షేత్రంలో వెలది మంది భక్తులు ఎంతొ భక్తి శ్రద్ధలతో గురుపౌర్ణమి ఉత్సవాలు ప్రతిసంవత్సరం జరుపుకుంటారు. కుల మత లకు అతితంగా రోజు అనేక మంది భక్తజనం స్వామి దర్షణము చేసుకొని పునితులు అవుతున్న దర్మ‌క్షెత్రము, ఈ ఏకశిల సద్గురు సాయినాథుని మందిరము. గురుపౌర్ణమి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలలో భక్తజనం అందరికీ సద్గురు సాయినాథుని మందిర నిర్వహకులు సాదర స్వాగతము పలుకుతున్నాము. గురుపౌర్ణమి వేడుకలలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సింది గా మడుపు శ్రీరమ్య వెణుగొపాల్ రావు.. సాయి సేవకులు తెలిపారు.