*గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి భాద్యత*
వైస్ యంపిపి నాగటి ఉపేందర్
*బదిలీపై వెళ్లిన ఉపాద్యాయులకు సన్మానం*
రామన్నపేట ఆగస్టు 26 (జనంసాక్షి) గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్ అన్నారు. మండల కేంద్రంలోని నీర్నెముల గ్రామంలోని ప్రాథమికొన్నత పాఠశాలలలో 4 సంవత్సరాలకు పైగా సేవలు అందించి శుక్రవారం బదిలీపై ఇతర జిల్లాలకు వెళుతున్న ఉపాద్యాయులు తండ వెంకటేశ్వర్లు మరియు పాఠశాలకు బదిలీపై వచ్చిన ఉపాద్యాయురాలు భవాని కి ఆహ్వాన సన్మాన కార్యక్రమానికి రామన్నపేట వైస్ యంపిపి ముఖ్యఅతిథిగా హాజరై సన్మాన గ్రహితలను శాలువా,మెమోంటో మరియు పూలదండలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ విధులు నిర్వహించిన ఉపాధ్యాయులు పిల్లల స్థాయికి తగ్గట్టుగా ఆటపాటలచే సులభంగా అర్ధమయ్యే రీతిలో బోధన చేసి, పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దారని కొనియాడారు పిల్లలకు జీవిత విలువలు నేర్పారని, గురువులు దైవసమానులని ఉపాధ్యాయులే జాతినిర్మాతలని వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి భాద్యత అని గుర్తుచేశారు సన్మాన గ్రహీతలు ఊరిలో సేవ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొబ్బిలి బుచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన సన్మాన సభలో ఎస్.ఎం.సి చైర్మన్ నాగటి జయశ్రీ ఉపేందర్ పాఠశాల ఉపాద్యాయులు తాటికొండ రవికిరణ్, స్వరూపరాణి,కృపారాణి పాఠశాల
విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




