గులాబీ మయమైన పెద్దపల్లి
సీఎం కేసీఆర్ ను స్వాగితిస్తూ హోర్డింగులు
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
పెద్దపల్లి జిల్లా గులాబీ మాయమయింది. భారీ జన సమీకరణ లక్ష్యంగా టిఆర్ఎస్ శ్రేణులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు బీసీ సంక్షేమ పౌరసరపరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు ఆదివారం ఆయన సభా ప్రాంగణం సభ ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. రాజీవ్ రహదారి మొత్తం స్వాగత తోరణాలతో నిండిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కేంద్రానికి సోమవారం రానుండడంతో అభిమాన నేతను స్వాగతిస్తూ తెరాసా శ్రేణులు పెద్ద ఎత్తున హోర్డింగులు, కటౌట్లు, ఫ్లెక్సీలు, బెలూన్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయాన్ని ప్రారంభించడానికి జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనుండటంతో సీఎం కెసిఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి.