గృహలక్ష్మి పథకానికి వచ్చిన దరఖాస్తులను ఇంటింటికి వెళ్లి పూర్తిస్థాయి విచారణ జరపాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, ఆగస్టు 19
(జనం సాక్షి);
రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ప్రకటించిన గృహ లక్ష్మీ పథకానికి వచ్చిన లబ్ధిదారుల దరఖాస్తులతో ఇంటింటికి వెళ్లి పూర్తిస్థాయిలో విచారించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఎం పి డి ఓ లు , కమిషనర్ లకు ఆదేశించారు.శనివారం ఐ డి ఓ సి కాన్ఫరెన్స్ హాల్ నందు గృహలక్ష్మి పథకం దరఖాస్తులపై ఎం పి డి ఓ లు, కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో వచ్చిన గృహలక్ష్మిపథకానికి సంబంధించిన దరఖాస్తులను త్వరగా ఇంటింటికి వెళ్లి విచారించి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్తలం ఉండి గృహం నిర్మించుకోవడానికి వీలుగా అసలైన గృహలక్ష్మి లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మండలాల వారిగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయని వివరాలు అడిగి తెలుగుసుకున్నారు. ఇంకా ఇంటింటికి వెళ్లివిచారించ వలసిన పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు వేగవంతం చేసి త్వరగాపూర్తి చేసి సమర్పించాలని అన్నారు. గ్రామాలలో పంచాయితీ సెక్రటరిలు ఆసరా పెన్షన్ కు సంబంధించి భర్త చనిపోయిన వారిని గుర్తించి భార్యకు వితంతువు పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హరిత హారం లో బాగంగా ఈ నెల 26 వ తేదీన జిల్లాకు ఉన్న లక్ష్యం ప్రకారం మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా గ్రామీణ అభివృధి అధికారికి ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాసులు , డి ఆర్ డి ఓ ఉమాదేవి , మున్సిపల్ కమీషనర్ నర్శింహ , అన్ని మండలాల ఎం పి డి ఓ లు , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు