గెల్లు శ్రీనివాస్‌కు మద్దతుగా గంగపుత్రుల ఆశీర్వాద సభ


హుజూరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): జమ్మికుంట పట్టణంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు మద్దతు తెలుపుతూ గంగపుత్రుల ఆధ్వర్యంలో ఆశీర్వాద సభ జరిగింది. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణంలో గంగపుత్రులు భారీ ర్యాలీ నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకే తమ మద్దతు ఉంటుందని ప్రకటిస్తూ.. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాబోయే ఉప ఎన్నిక ఖర్చు నిమిత్తం రూ. 25,116 లు విరాళంగా ఇచ్చింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, ముఠా గోపాల్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తక్కెళ్లపల్లి రాజేశ్వర్‌ రావు, వైస్‌ చైర్మన్‌ దేశిని స్వప్న కోటి, టీఆర్‌ఎస్‌ నాయకులు తుమ్మెటి సమ్మిరెడ్డి, పోనగంటి మల్లయ్య, టంగుటూరి రాజ్‌ కుమార్‌ తో పాటు తదితరులు ఉన్నారు.