గేమ్స్ విలేజ్‌లోకి అడుగు పెట్టిన బింద్రా
లండన్ : ప్రతిష్టాత్మకమైన లండన్ ఒలంపిక్స్ కోసం నిర్మించిన గేమ్స్ విలేజ్‌లో భారత క్రీడకారుల బృందం అడుగు పెట్టింది. బీజింగ్ ఒలంపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా ఈ విలజ్లో అడుగు పెట్టిన మొదటి భారత క్రీడకారుడు అయ్యాడు. బింద్రాతో పాటు 10 మంది అర్చరీ టీమ్ సభ్యులు, నలుగురు సభ్యుల వెయిట్ లిఫ్టింగ్ బృందం కూడా విలేజ్లోకిి అడుగు పెట్టింది. వీరంత గేమ్స్ విలేజ్‌ని పరిశిలించి, తర్వాత వారి ప్రక్టీస్ వేదికల కోసం వెళ్లిపోయారు. భారత్ నుండి ఈ సారి 81 మంది అథ్లెట్లు, 51 మంది అధికారులు లండన్ ఒలంపిక్స్ కోసం వెళ్లనున్నారు. వీరందరికి సీ సైడ్ బిల్డింగ్ ఎస్1 లో బస ఏర్పాటు చేశారు. ఒలంపిక్స్‌కు మూదో సారి అతిథ్యం ఇస్తున్న లండన్ అత్యధునిక వసతులతో గేమ్స్ విలేజ్ నిర్మించింది. 850 కోట్ల పైగా ఖర్చుతో నిర్మించిన విలేజ్‌లో 2818 టౌన్ హౌసెస్, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మొత్తం 15 వేల మంది దినిలో ఉండే ఏర్పాటుంది. ప్రతీ టౌన్ హౌస్ డదగ్గర నిర్వహకులు వాలంటీర్లను ఏర్పాటు చేశారు. బస చేసిన క్రీడకారులకు కావల్సిన సదుపాయాల విషయంలో వీరు సహయంగా ఉండనున్నారు. భారత క్రీడకారుల కోసం లండన్‌లో నివశించే ఇండియాన్ సిటిజన్స్‌నే నియామించారు. ఇదిలా ఉంటే భారత అథ్లేట్ల బృందం కోసం ఆదివారం ప్రత్యేక స్వాగతకార్యక్రమం ఉంటుంది. ఆ సమాయానికి భారత క్రీడకారులందరూ అక్కడికి చేరుకుంటారు.