గొప్పగొప్ప పోరాటాల చరిత్రలను వక్రీకరించడం,అబద్ధాలు చెప్పడం బిజెపికే సాధ్యం. సి.పి.ఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్.

కోటగిరి సెప్టెంబర్ 12 జనం సాక్షి:-అబద్ధాలు చెప్పడం,చరిత్రను వక్రభాష్యాలు చేయడం ఆర్ఎస్ఎస్,బిజెపిలకు అలవాటుగా మారిందని కోటగిరి మండల సి.పి.ఐ కార్యదర్శి అంబటి విఠల్ గౌడ్ మండిపడ్డాడు.సోమవారం నాడు కోటగిరి మండల కేంద్రంలో సి.పి.ఐ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ సమావేశంలో విఠల్ గౌడ్ మాట్లాడుతూ..బ్రిటిష్ వారి నుండి భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం నైజాం రాచరిక,భూస్వామ వ్యవస్థలో కొనసాగింది.భూమి కోసం,భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం గ్రామాల్లో కమ్యూనిస్టులు ఆధ్వర్యంలో పోరాటాలు చేశారు.రజాకార్ల మితి మీరిన అరాచకాలు పరాకాష్టకు చేరుకోవడంతో 1947 సెప్టెంబర్ 11న కమ్యూనిస్టు యోధులు రావి నారాయణరెడ్డి, మగ్దుం మొహినుద్దీన్,బద్దం ఎల్లారెడ్డి లు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు.ఆ పోరాటంలో 4,000 మంది కమ్యూనిస్టులు అమరులైనారు వారి త్యాగ ఫలితంతో 3000 గ్రామాల్లో వేట్టిచాకిరి విముక్తి అయింది,10 లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగింది ప్రజలు బాంచన్ దొర కాళ్లు మొక్కుతా అన్న నినాదం మారి నైజాం పాలనకు వ్యతిరేకంగా బంధుకులు పట్టినారు.నీజాం ప్రభువుకు గత్యంతరంలేక చివరకు 1948 సెప్టెంబర్ 17న భారత్ యూనియన్లో లొంగి పోవాల్సి వచ్చింది కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బిజెపిలు 1948 సెప్టెంబర్ 17 భారత దేశంలో విలీనం సెప్టెంబర్ 17న ముస్లిం రాజు నుండి విమోచనం పొందిందని చరిత్రకు మతం రంగు పుస్తున్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆర్ఎస్ఎస్,బిజెపి పాత్ర లేదని లేని చరిత్ర కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తూ బిజెపి చరిత్ర కోసం పాకులాడుతున్నదని అన్నారు.ఈ పోరాటాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆనాడు ఉన్న హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని కర్ణాటకలో ఐదు జిల్లాలు, మహారాష్ట్రలో మూడు జిల్లాలలో అక్కడున్న ప్రభుత్వాలు అధికారికంగా తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంను అధికారికంగా జరుపుతు న్నప్పటికీ ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి కేసీఆర్ మర్చిపోయారని ఇకనైనా సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో విలీన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని,కమ్యూనిస్టుల త్యాగాలను పాఠ్యాంశాలలో చేర్చాలని కోరారు.తెలంగాణ రైతాంగ పోరాట అమరవీరులను స్మరిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న కోటగిరి బస్టాండ్ వద్ద ఉదయం 9 గంటలకు జాతీయ జెండా ఎగర వేయడం జరుగుతుందని పేర్కొన్నారు.ఈ సమావేశంలో నల్ల గంగాధర్,దత్తు,బుడాల రాములు,రాజు,తదితరులు పాల్గొన్నారు.