గొర్రెలు,మేకలకు నట్టల మందు పంపిణి
మద్దూరు (జనంసాక్షి) జూన్ 11: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో గొర్రెలకు మేకలకు నట్టల మందు పంపిణీ కార్యక్రమాన్ని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జీఎంపీఎస్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆలేటి యాదగిరి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెంపకందారులు జీవాలకు వేసే ఉచిత నట్టల మందును ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ నట్టల మందు కార్యక్రమం నెల రోజులు ఆలస్యంగా చేపట్టడం వల్ల పెంపకందారులు నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ద్వారా వచ్చే వ్యాక్సిన్లను జీవాలకు సరైన సమయంలో వేయాలని కోరారు. లేకపోతే ఆలస్యంగా వేసిన వ్యాక్సిన్ ల వల్ల పెంపకం దారులకు ఉపయోగం లేకుండా పోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పర్వయ్య, సత్యం, రాజశేఖర్, సంఘ నాయకులు పెంపకందారులు చేట్కురి రవీందర్, ఆలేటి మల్లయ్య, బోడపట్ల ఆంజనేయులు, బోడపట్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.