గొర్రెల పంపిణీలో ముందున్న జిల్లా

ఖమ్మం,జూలై28(జ‌నం సాక్షి): ప్రభుత్వం అందచేస్తున్న ఉచిత గొర్రెల పంపిణీ పథకం అమలులో ఖమ్మం జిల్లా అగ్రస్థానంలో ఉందని అధికారులు తెలిపారు. గొల్ల, కురుములకు సరఫరా చేసిన గొర్రెల యూనిట్లను అభివృద్ది చేసుకుని ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వ లక్ష్యం నీరుకారకుండా చూడాలన్నారు.రాయితీ గొర్రెల పంపిణీ పథకంలో ఖమ్మం జిల్లా అధికారుల తీరు చాలా బాగుందని రాష్ట్ర గొర్రెల ఫెడరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వీ లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొదటిదశకు సంబంధించి ఎంపికైన లబ్దిదారులకు గొర్రెల యునిట్లు పంపిణీ చేయడం జరుగతుందన్నారు. అయితే ఇప్పటికే కొన్ని జిల్లాలో మొదటి లిస్టుకు సంబంధించిన పంపిణీ కార్యక్రమం పూర్తయ్యిందన్నారు. ఖమ్మం జిల్లాలో మొదటి దశకు సంబంధించి ఆగస్టు 15 తేదీ లోపు కొనుగోలు పక్రియ పూర్తి చేయాలన్నారు.అనంతరం రెండవ దశకు సంబంధించిన పెంపకందారులకు గొర్రెలను పంపిణీ చేయాలని సూచించారు. అటవీ భూములలో గొర్రెల పశుగ్రాసం పెంచుకునేందుకు అటవీశాఖ అధికారులు అనుమతించాలని ఆయన కోరారు. గొర్రెల పంపిణీలో అవతకవలకు తావు లేకుండా చూసుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు.