పాక్‌ను లొంగదీసుకున్నాం:మోదీ
` ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాం
` సిందూరం తుడిచిన వాళ్లకు ఆపరేషన్ సిందూర్‌తో జవాబిచ్చాం
` పాక్‌తో ఎలాంటి వాణిజ్యం, చర్చలు ఉండవు
` ఒకవేళ ఉంటే అది పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే
` ఉగ్రవాదులను ఉసిగొల్పితే ఇక ఊరుకునేది లేదు
` భారత ప్రజల జోలికివస్తే.. గట్టి గుణపాఠం తప్పదు
` మన దేశానికి న్యాయంగా చెందాల్సిన నీరు ఇక పాక్‌కు ప్రవహించదు
` రాజస్థాన్ బికనీర్ వేదికగా మరోసారి పాక్‌ను హెచ్చరించిన ప్రధాని మోడీ
జయపుర(జనంసాక్షి): మన మహిళల సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశామని ప్రధాని మోడీ అన్నారు. మన భద్రతా బలగాలు పాకిస్థాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాయని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ ను ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో దేశ ప్రజలంతా గర్విస్తున్నారని అన్నారు. రాజస్థాన్‌లో పర్యటిస్తున్న సందర్భంగా బికనీర్‌లో ఏర్పాటు చేసిన సభలో పహల్గామ్ గురించి మాట్లాడుతూ.. ఉద్వేగపూరితంగా ప్రపంగం చేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదులను అంతం చేశామని తెలిపారు. కేంద్రం త్రివిధ దళాలకు పూర్తి స్వచ్ఛ ఇచ్చిందని గుర్తుచేశారు. మన దళాలు చక్ర వ్యూహాలు పన్ని శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేశాయని తెలిపారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడికి జవాబుగా 22 నిమిషాల్లోనే ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు చెప్పారు. భారత్‌లో రక్తపుటేర్లు పారించిన వాళ్లను ముక్కలు.. ముక్కలు చేసినట్లు మోడీ పేర్కొన్నారు. మే 7న చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా మరియు హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద గ్రూపులతో అనుబంధంగా ఉన్న దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటానికి భారతదేశం ఐక్యంగా ఉందని చెప్పారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి 140 కోట్ల మంది భారతీయులను కదిలించిందన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదుల గుండెపై దాడి చేశామన్నారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ నివ్వడంతోనే ఇదంతా జరిగిందని మోడీ చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు.. అమాయకులను లక్ష్యంగా చేసుకున్నారని.. మతం ఆధారంగా వేరు చేసి.. మహిళల నుదిటిపై ఉన్న సిందూరాన్ని తుడిచేశారని.. దానికి ప్రతీకారంగానే మన దళాలు వాళ్లను మట్టిలో పాతిపెట్టేశారన్నారు. 140 కోట్ల మంది భారతీయుల హృదయాలను గాయపరిచారు.. అందుకే వాళ్లను ముక్కలు.. ముక్కలు చేశామని వెల్లడిరచారు. కేవలం 22 నిమిషాల్లోనే ఉగ్రవాదుల శిబిరాలు నాశనం అయినట్లు చెప్పారు. త్రివిధ దళాల దెబ్బకు పాకిస్థాన్ వెనక్కి తగ్గిందని తెలిపారు. ఇక అణు బాంబుల భయానికి భారతదేశం వెనుకాడదని మరోసారి మోడీ స్పష్టం చేశారు.’సిందూరం భగ్గుమంటే దాని ఫలితం ఎలా ఉంటుందో అందరూ చూశారు. ఏప్రిల్ 22న ఉగ్రదాడికి ప్రతిగా 22 నిమిషాల్లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం. ఉగ్రమూకలను మట్టిలో కలిపేశాం. నా సిరల్లో రక్తం కాదు సిందూరం ప్రవహిస్తోంది. పాక్‌లోని రహిమ్ యార్ ఖాన్ ఎయిర్‌బేస్ ఐసీయూలో ఉంది. అణబెదిరింపులకు భారత్ ఇక ఏమాత్రం భయపడదు. పాక్‌తో ఎలాంటి వాణిజ్యం, చర్చలు ఉండవు. చర్చల మాట అంటూ వస్తే.. అది పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే. ఉగ్రదాడి జరిగితే.. పాక్ ఆర్మీ, ఆర్థికవ్యవస్థ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మనం స్పష్టంచేశాం. మన దేశానికి న్యాయంగా చెందాల్సిన నీరు ఇక పాక్‌కు ప్రవహించదు. భారత ప్రజల జోలికివస్తే.. గట్టి గుణపాఠం తప్పదు‘ అని గట్టి హెచ్చరికలు చేశారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీ కృషి జరుగుతోంది. ఈ దిశగా గత 11 ఏళ్లుగా అవిశ్రాంతంగా పనిచేశాం. భారత రైలు నెట్‌వర్క్ ఆధునికీకరిస్తున్నాం. వేగం, పురోగతికి వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు ప్రతీకలు అంటూ కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునర్నిర్మించిన దేశ్‌నోక్ స్టేషన్‌ను ప్రారంభించారు. అలాగే బికనేర్-ముంబయి ఎక్స్‌ప్రెస్ రైలుకు జెండా ఊపారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. అలాగే దేశ్‌నోక్‌లోని కర్ణిమాత ఆలయంలో పూజలు చేశారు. ఇక అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 18 రాష్టాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ స్టేషన్లను రాజస్థాన్ నుంచి వర్చువల్‌గా మోడీ ప్రారంభించారు. కొత్త స్టేషన్లను జాతికి అంకితమిచ్చారు. ఇందులో తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఏపీలోని సూళ్లూరుపేట అమృత్ భారత్ స్టేషన్‌ను కూడా ప్రారంభించారు.యూపీలో 19, గుజరాత్‌లో 18, మహారాష్ట్రలో 15, రాజస్థాన్‌లో 8 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ పాల్గొన్నారు. అంతకుముందు బికనీర్‌లోని కర్ణిమాత ఆలయాన్ని ఆయన సందర్శించారు. అమ్మవారికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మ వారి తీర్థ ప్రసాదాలను ఆలయ పూజారులు.. ప్రధాని మోదీకి అందజేశారు. అనంతరం బికనీర్ ఎయిర్ బేస్‌ను మోదీ సందర్శించారు. మరోవైపు బికనీర్ సవిూపంలో పాలనా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం తొలిసారిగా ప్రధాని మోదీ రాజస్థాన్‌లో పర్యటించారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన సరిగ్గా నెల రోజులకు ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని బికనీర్ ఎయిర్ బేస్‌ను సందర్శించడం గమనార్హం.
103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన మోదీ
` తెలంగాణలో రైల్వేల అభివృద్ధిలో వేగం పెంచాం
` దసరా రోజు కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
జైపుర్,హైదరాబాద్(జనంసాక్షి):అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. వీటిని జాతికి అంకితమిచ్చారు. ఇందులో తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఏపీలోని సూళ్లూరుపేట అమృత్ భారత్ స్టేషన్‌ను కూడా ప్రారంభించారు. ప్రారంభోత్సవం తర్వాత పాఠశాల విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. యూపీలో 19, గుజరాత్‌లో 18, మహారాష్ట్రలో 15, రాజస్థాన్‌లో 8 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించారు.వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కడియం కావ్య, శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ పాల్గొన్నారు.
దసరా రోజు కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
తెలంగాణలో రైల్వేల అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బేగంపేట, కరీంనగర్, వరంగల్‌లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బేగంపేట రైల్వే స్టేషన్‌లో మహిళలే పని చేయబోతున్నారని తెలిపారు. దేశంలో 1,300 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ప్రమాదాలు జరగకుండా కవచ్ టెక్నాలజీని తీసుకొచ్చినట్లు తెలిపారు.‘’తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రూ.80 వేల కోట్ల పనులకు సంబంధించి ప్రణాళికలు చేస్తున్నాం. దసరా రోజు కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ను ప్రారంభిస్తాం. ఎంఎంటీఎస్ రెండో ఫేజ్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. యాదగిరిగుట్టకు కూడా ఎంఎంటీఎస్ పనులు ప్రారంభిస్తాం’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.చీవషం)