శ్రీశైలం, సాగర్ నీటి పంపకాలు
` ఏపీకి 4 టీఎంసీలు.. తెలంగాణకు 10.26 టీఎంసీలు
` కేటాయిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు
హైదరాబాద్(జనంసాక్షి): వేసవి నీటి అవసరాల దృష్ట్యా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి ఏపీకి 4 టీఎంసీలు, తెలంగాణకు 10.26 టీఎంసీలు విడుదల చేయనున్నారు.ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలంలో 800 అడుగులు, సాగర్‌లో 505 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఏపీ అవసరాల కోసం సాగర్ కుడి కాల్వ నుంచి రోజుకు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. శ్రీశైలంలో జులై నెలాఖరు వరకు 800 అడుగుల కనీస మట్టం కొనసాగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.