గొర్రెల పథకాన్ని నీరుగార్చరాదుగొర్రెల పథకాన్ని నీరుగార్చరాదు
అమ్ముకుంటే కఠిన చర్యలు తప్పవు
మెదక్,ఆగస్ట్7(జనంసాక్షి): గొర్రెల కాపరుల జీవితాల్లో వెలుగులు నింపాలనే బృహత్తర లక్ష్యంతో ప్రభుత్వం గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తోందనీ గొర్రెల సహకార సంఘం అధ్యక్షుడు రాజయ్య యాదవ్ అన్నారు.
ఎక్కడైనా యూనిట్లను విక్రయిస్తే ఆయా సంఘాల అధ్యక్షులను బాధ్యులను చేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల కొన్నిచోటల్ కొందరు గొర్రెలను తరలిస్తూ పట్టుబడ్డ సంఘటనలు సిగ్గు చేటన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా ఎదగాలని తోడ్పాటును అందిస్తే దానికి తూట్లుపొడుస్‌ఉతన్నారని అన్నారు. కొందరు లబ్దిదారులు గొర్రెల యూనిట్లను అమ్ముకుంటున్నట్లు సమాచారం ఉందనీ, సదరు వ్యక్తులు వెంటనే గొర్రెలను వెనక్కి తెచ్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందించిన యూనిట్లను అమ్మడం.. కొనడం నేరమని తెలిపారు. గొర్రెలను అమ్మితే అక్కడి గొర్రెల కాపరుల సంఘాల అధ్యక్షులను బాధ్యులను చేస్తామని చెప్పారు. ఈ సంఘాలు లబ్ధిదారులపై నిఘా వేసి ఉంచాలని సూచించారు. ఇప్పటికే గొర్రెలను అమ్ముకున్న వారు తమ గొర్రెలను తిరిగి వెనక్కి తెచ్చుకోవాలని కోరారు. గొర్రెల యూనిట్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు సంఘాల వారు చర్యలు తీసుకోవాలని అన్నారు. గొర్రెల యూనిట్ల పంపిణీ పారదర్శకంగా చేపడుతున్నామని చెప్పారు. వచ్చే మార్చి వరకు ఈ ఏడాదికి సంబంధించిన టార్గెట్ మేరకు పూర్తి చేస్తామని తెలిపారు. గొర్రెల మేతకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.